పుష్ప-2 డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక మొదటి రోజులూ సినిమా టికెట్స్ ధరలు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోస్ ప్రదర్శించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 4వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు అంటే మూడు వారాల పాటు టికెట్స్ ధరలు పెంచుకోవడానికి అనుమటించింది.
డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు మళ్ళీ అర్ధరాత్రి ఒంటి గంటకు రెండు ప్రత్యేక షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.
రాష్ట్రంలో మొట్ట మొదటి 9.30 గంటల షోకి ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా మరో రూ.800 పెంచింది. ఇది సింగిల్ స్క్రీన్, మల్టీ స్క్రీన్స్ థియేటర్లకు వర్తిస్తాయి. అంటే టికెట్ ధర రూ.200 ఉంటే అదనంగా మరో రూ.800 కలిపి రూ.1,000లు పెట్టి కొనుక్కోవలసిందే. మల్టీప్లెక్స్ థియేటర్లలో టికెట్స్ రేట్స్ రూ.400 వరకు ఉన్నాయి కనుక వాటికి మరో రూ.800 కలిపి రూ.1,200లు పెట్టి కొనుకొని చూడాల్సిందే.
అర్దరాత్రి ఒంటి గంట షో తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు మరో షో వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.