సింబా వస్తున్నాడు.. యాక్షన్‌కి రెడీయేనా?

November 29, 2024


img

దర్శకుడు ప్రశాంత్ వర్మ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. “సింబా ఈజ్ కమింగ్.. రెడీ ఫర్ సమ్ యాక్షన్?’ అంటూ వర్మ తన సినిమాలో మోక్షజ్ఞ ఏవిదంగా కనిపించబోతున్నాడో ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

గత రెండు మూడేళ్లుగా మోక్షజ్ఞ సినీ పరిశ్రమలో ప్రవేశిస్తాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ బాలకృష్ణ తన కుమారుడిని పరిచయం చేయడానికి ఏమాత్రం తొందరపడలేదు. ఎట్టకేలకు హనుమాన్ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ చేతికి తన కొడుకుని అప్పగించారు. 

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెర కెక్కిస్తున్న ఈ సినిమాని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పణలో లెజెండ్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్లపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా హనుమాన్ సినిమాలాగే సోషియో ఫాంటసీ అని ప్రశాంత్ వర్మ ముందే చెప్పేశారు. బాలకృష్ణ తనపై ఎంతో నమ్మకం పెట్టి మోక్షజ్ఞని తన చేతిలో పెట్టడం గౌరవంగా భావిస్తున్నానని వర్మ అన్నారు. ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్ సెప్టెంబర్ 6 న విడుదల చేశారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తికాగానే త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. 


Related Post

సినిమా స‌మీక్ష