మల్లారెడ్డి కాలేజీలో పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్?

November 29, 2024


img

పుష్ప-2 విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అల్లు అర్జున్‌తో సహా పుష్ప-2 మూవీ ప్రమోషన్స్ కోసం దేశమంతా చుట్టేస్తోంది. డిసెంబర్ 1 వ తేదీన హైదరాబాద్‌ మల్లారెడ్డి కాలేజీలో పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. దీనికి కాలేజీ యాజమాన్యంతో పాటు హైదరాబాద్‌ పోలీసులు కూడా అనుమతించిన్నట్లు తెలుస్తోంది. కనుక నేడో రేపో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

అల్లు అర్జున్‌ బృందం నేడు పుష్ప-2 మూవీ ప్రమోషన్స్ కోసం ముంబయి బయలుదేరబోతున్నారు. బిహార్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో అభిమానులు అల్లు అర్జున్‌ బృందానికి జేజేలు పలికారు. ముంబయిలో కూడా ఘనస్వాగతం లభించడం ఖాయమే. 

పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ అయిన తర్వాత రెండో భాగంపై పెట్టుబడి విషయంలో మైత్రీ మూవీ మేకర్స్‌ ఏమాత్రం వెనుకంజ వేయలేదు. 

ఇప్పుడు అట్టహాసంగా దేశం నలుమూలల పుష్ప-2 సినిమా ప్రమోషన్స్ జరుగుతున్న తీరు చూస్తుంటే, వాటి కోసం కూడా చాలా భారీగానే ఖర్చు చేస్తోందని అర్దమవుతూనే ఉంది. పుష్ప-2 ప్రమోషన్స్ కోసం చేస్తున్న ఖర్చుతో రెండు మూడు చిన్న సినిమాలు తీయవచ్చని ఇండస్ట్రీలో అనుకుంటున్నారంటే ఏ స్థాయిలో ఖర్చు పెడుతున్నారో ఊహించుకోవచ్చు. 

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా చేసిన పుష్ప-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష