ప్రతీ ఒక్కడూ బచ్చలమల్లే… ఒప్పుకుంటారు!

November 28, 2024


img

అల్లరి నరేష్, అమృత అయ్యర్ జోడీగా చేసిన ‘బచ్చలమల్లి’ సినిమా టీజర్‌ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో విలేఖరులు అడిగిన ప్రశ్నకు అల్లరి నరేష్ సమాధానం చెపుతూ, “ప్రతీ మనిషిలో కొంత మూర్ఖత్వం ఉంటుంది. ఆ మూర్ఖత్వం వల్ల ప్రతీ ఒక్కరూ జీవితంలో ఎంతో కొంత నష్టపోతుంటారు. ఆ మూర్ఖత్వం హద్దులు దాటితే ఎలా ఉంటుందనేది మా ఈ సినిమా బచ్చలమల్లి సినిమా.

ఈ సినిమాలో బచ్చలమల్లి  పాత్రతో ప్రతీ ఒక్కరూ మమేకం అవుతారని నమ్ముతున్నాను. ఆ ధైర్యంతోనే పుష్ప-2 విడుదలైన కొద్ది రోజులకే అంటే డిసెంబర్ 20వ తేదీన విడుదల చేస్తున్నాము,” అని చెప్పారు.      

ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ గ్రామంలో ట్రాక్టర్ నడుపుకుంటూ బ్రతికే బచ్చలమల్లిగా నటిస్తున్నారు. కాస్త మొరటుతనం, మొండితనం, మూర్ఖత్వం కలిస్తే బచ్చలమల్లి అని దర్శకుడు చెప్పారు. 

ఈ సినిమాలో రావు రమేష్, కోటా జయరాం, సాయి కుమార్, ధన్‌రాజ్, హరితేజ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.    

ఈ సినిమాకి దర్శకుడు: సుబ్బు మంగదేవి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం నాధన్, ఎడిటింగ్: చోట కె ప్రసాద్, స్క్రీన్ ప్లే: విపర్తి మధు చేస్తున్నారు.

అల్లరి నరేష్ 63వ సినిమాగా వస్తున్న బచ్చల మల్లిని రాజేష్ దండ, బాలాజీ గుట్ట కలిసి హాస్య మూవీఎస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20 వ తేదీన విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష