వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలలో ‘శ్రీకాకుళం షేర్‌లాక్స్ హోమ్స్’ సినిమా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. ప్రముఖ సినీ రచయిత రైటర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది.
సినిమా పేరులోనే సినిమా కాన్సెప్ట్ ఏమిటో చెప్పేశారు. వెన్నెల కిషోర్ పేరు తలుచుకుంటేనే ఎవరికైనా పెదవులపై చిన్న చిర్నవ్వు వస్తుంది. అదే ఆయన ఓ డిటెక్టివ్ పాత్ర చేస్తే ఆ కామెడీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. టీజర్ చూస్తే సినిమాలో కామెడీ పుష్కలంగా ఉంటుందని స్పష్టమవుతుంది.
ఈ సినిమాలో సియా గౌతం, మహాదాస్యం రవి తేజ, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం: సునీల్ కాశ్యప్, కెమెరా: మల్లిఖార్జున నరగాని, ఆర్ట్: సురేష్ భీమగాని, ఎడిటింగ్: అవినాష్ గులింక, స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: శేఖర్ వీజే చేస్తున్నారు.
లాస్య రెడ్డి సమర్పణలో తెరకెక్కించిన ఈ సినిమాని శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు.