రాపో22కి రామ్ పోతినేని టీమ్ రెడీ?

November 28, 2024


img

రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ కొత్త సినిమా మొదలు పెట్టింది. నవంబర్ 21న సినిమా పూజా కార్యక్రమం చేసిన తర్వాత ‘రాపో22’ అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలు పెడుతున్న ఈ సినిమాలో పనిచేయబోయే సాంకేతిక నిపుణుల పేర్లను ప్రకటిస్తోంది.

పూజా కార్యక్రమం సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చాలా అక్కటుకుంటోంది. ఓ యువకుడు సైకిల్‌ పట్టుకొని హైదరాబాద్‌, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద గల ప్రఖ్యాత సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్‌ ఆవరణలోకి ప్రవేశిస్తున్నట్లు దానిలో చూపారు. ఆ థియేటర్ ఆవరణలో బాలయ్య కటౌట్ ఉంది. ఈ రెంటితో ఇదో పీరియాడికల్ మూవీ అని దర్శకుడు హింట్ ఇచ్చారు.       

పి మహేష్ బాబు దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోరే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకి వివేక్, మెర్విన్ సంగీత దర్శకత్వం చేయబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది.

తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధు నీలకందన్‌ రాపో22 కి పనిచేయబోతున్నారని తెలియజేసింది. ఈ సినిమాకి రామ్ మిరియాల, కార్తీక్ పాటలు అందించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోతున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వెల్లడించనున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష