కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్ 18 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన తర్వాత రెండేళ్ళ క్రితం అంటే 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వారిరువురి మద్య రాజీ కుదిర్చేందుకు రజినీకాంత్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి.
వారు పరస్పర అంగీకారంతో విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ పెట్టుకోగా, న్యాయస్థానం కూడా వారిని మళ్ళీ కలిపేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కనుక వారికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది.
ధనుష్, ఐశ్వర్య దంపతులకు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులున్నారు. వారిరువురూ ప్రస్తుతం తల్లితో కలిసి తాతగారు రజినీకాంత్ ఇంట్లోనే ఉంటున్నారు.
నయనతారపై మద్రాస్ హైకోర్టులో కేసు వేసి ధనుష్ మరోసారి వార్తలలో నిలుస్తున్నారు. నయనతార జీవిత విశేషాలను తెలియజేస్తూ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓ డాక్యుమెంటరీ ప్రసారం అవుతోంది. దానిలో తన అనుమతి లేకుండా ‘నానుం రౌడీ డాన్’ అనే సినిమా నుంచి 3 సెకన్లు నిడివి గల క్లిప్పింగ్ వాడుకునందుకు ఆ సినిమా నిర్మాత ధనుష్ వారిపై మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు.