అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అమెజాన్ ప్రైమ్‌లో

November 27, 2024


img

సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్, రుక్మిణీ వసంత్ జంటగా చేసిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఈ నెల 8న థియేటర్లలో విడుదలైంది. కానీ 20 రోజులు గడవక ముందే ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టారో ఎప్పుడు పూర్తిచేశారో తెలియన్నట్లు అంతా జరిగిపోయింది. సినిమా ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. బహుశః అదే సినిమాపై ప్రభావం చూపి ఉండవచ్చు. అందుకే ఇంత త్వరగా ఓటీటీలోకి వచ్చేసింది. 

ఈ సినిమాలో దివ్యాంషు కౌశిక్, హర్ష చెముడు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం: సన్నీ ఎంఆర్, పాటలకు సంగీతం: కార్తీక్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్: వెంకట్, కెవిన్ స్మిత్, టిడిపి జేమ్స్ చేశారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. 

ఈ సినిమా కధ ఏమిటంటే రేసర్‌గా గుర్తింపు సంపాదించుకోవాలనే పెద్ద కలతో రిషి (నిఖిల్) లండన్ వెళ్తాడు. అక్కడ తులసి (రుక్మిణీ వసంత్)తో పరిచయం, ప్రేమ సాగిన తర్వాత ఓ రోజు ఆమె కనబడకుండా మాయం అవుతుంది. ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు మన హీరో చేసిన ప్రయత్నాలే మిగిలిన కధ. స్క్రీన్ ప్లేలో కొంత గందరగోళం ఏర్పడటం వలన ప్రేక్షకులు కధతో సరిగ్గా కనెక్ట్ కాలేకపోయారు. మరి ఓటీటీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారో లేదో?


Related Post

సినిమా స‌మీక్ష