కేరళలో కూడా పుష్పరాజ్ క్రేజ్ మామూలుగా లేదే!

November 27, 2024


img

పుష్ప-2 ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం సాయంత్రం కేరళలోని కొచ్చిలో జరిగే కార్యక్రమంలో అల్లు అర్జున్‌ పాల్గొనబోతున్నాడు. ఎక్కడో బీహార్ రాజధాని పాట్నలో పుష్ప-2 ట్రైలర్ విడుదలకు అల్లు అర్జున్‌ వస్తే 2 లక్షలకు పైగా అభిమానులు తరలి వచ్చి పుష్పరాజ్‌కి జేజేలు పలికారు. 

అటువంటప్పుడు కేరళలో ఎంతో పాపులర్ అయిన అల్లు అర్జున్‌ వస్తే మళయాళీలు ఊరుకుంటారా? ఈరోజు మద్యాహ్నం నుంచి కొచ్చి విమానాశ్రయానికి భారీగా అభిమానులు తరలి రావడం మొదలుపెట్టారు. సాయంత్రానికి వేలమంది అభిమానులు కొచ్చి విమానాశ్రయం వద్ద పుష్పరాజ్ కోసం గుమిగూడటంతో వారిని నియంత్రించడం కోసం అదనపు పోలీసు బలగాలను రప్పించాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. 

ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన మళయాళీ నటుడు ఫహాద్ ఫాసిల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే రష్మిక మందన కూడా. కనుక కొచ్చిలో పుష్ప-2 హడావుడి మామూలుగా లేదు. మరికొద్ది సేపటిలో కొచ్చిలోని  గ్రాండ్ హయాత్, లివా హాల్లో పుష్ప-2 హడావుడి మొదలవుతుంది.


Related Post

సినిమా స‌మీక్ష