సిద్దార్థ్, అదితీ పెళ్ళి ముచ్చట ఇంకా తీరలేదా?

November 27, 2024


img

టాలీవుడ్ సినీ నటులు సిద్దార్థ్, అదితీ రావు రెండు నెలల క్రితం తెలంగాణలో వనపర్తి జిల్లాలోని 400 ఏళ్ళు చరిత్ర కలిగిన రంగనాధ స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు. ఆ కారణంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనే వారి కోరిక తీరకపోవడంతో మళ్ళీ పెళ్ళి చేసుకొని ఆ ముచ్చట కూడా తీర్చుకున్నారు. 

ఈసారి రాజస్థాన్‌లో భీషన్‌ఘర్ వద్ద గల ప్రఖ్యాత అలీల కోటలో ఇద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. కనుక బంధుమిత్రులు మళ్ళీ వారి వివాహానికి హాజరయ్యి ఆశీర్వదించారు.

అదితీరావు పూర్వీకులది వనపర్తి జిల్లా కావడం, వారి కుల దైవం రంగనాధస్వామి కావడంతో వారి కోరిక మేరకు మొదట అక్కడ వివాహం జరిపించారు. ఇప్పుడు రాజ్యస్థాన్‌లో మరోసారి పెళ్ళి చేసుకున్నారు. మాహ సముద్రం సినిమా షూటింగ్ సమయంలో వారిరువురూ ప్రేమలో పడి, చివరికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష