పుష్ప-2 ఐటెమ్ సాంగ్‌ ఫోటో లీక్!

November 09, 2024


img

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక జంటగా పుష్ప-2 డిసెంబర్‌ 5వ తేదీన విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఐటెమ్ సాంగ్‌ షూటింగ్‌ జరుగుతోంది. పుష్ప-1లో ‘ఊ అంటావా మావా...” అనే ఐటెమ్ సాంగ్‌కి సమంత చేసిన డాన్స్ సినిమాకే హైలైట్గా నిలిచినందున పుష్ప-2లో ఐటెమ్ సాంగ్‌ అంతకు మించి ఉంటుందని అందరూ ఆశించడం సహజమే. కనుక దాని కోసం అనేక పేర్లు వినిపించినప్పటికీ చివరికి శ్రీలీలకి ఆ ఛాన్స్ దక్కింది. పుష్ప-2 ఐటెమ్ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు ఓ ఫోటో లీక్ అవడంతో అది వైరల్ అవుతోందిప్పుడు. 

దానిలో అల్లు అర్జున్‌ ఎర్పు రంగు దుస్తులు ధరించి ఉండగా, శ్రీలీల నలుపు రంగు దుస్తులతో కనిపించింది. ఈ పాటకు వేసిన సెట్స్‌ కూడా బ్యాక్ గ్రౌండ్‌లో కనిపిస్తున్నాయి. 

పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, జగపతిబాబు, శ్రీతేజ్, మీమ్ గోపిలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. వచ్చే నెల 5వ తేదీన పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 



Related Post

సినిమా స‌మీక్ష