మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట ప్రభాస్‌ని శివుడి పాత్ర ఇవ్వాలనుకున్నామని కానీ ఆయన వేరే పాత్ర ఎంచుకున్నారని మంచు విష్ణు స్వయంగా చెప్పారు. ఈ సినిమాలో శివపార్వతులుగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమాలో నటిస్తున్న పాత్రదారులందరినీ పరిచయం చేస్తూ వారి పోస్టర్స్ విడుదల చేసినప్పటికీ, ఇంతవరకు ప్రభాస్ ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేయలేదు.
ఓ పోస్టర్‌లో ప్రభాస్ కాళ్ళు, మరో పోస్టర్‌లో కళ్ళు మాత్రమే చూపించారు. కనుక ఈ సినిమాలో ప్రభాస్ ఏవిదంగా ఉంటారో చూడాలని అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజున లేదా దీపావళికి తప్పకుండా ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేస్తారనుకుంటే చేయలేదు. మళ్ళీ మంచు విష్ణు పోస్టర్ విడుదల చేశారు.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్-లుక్ పోస్టర్‌లో మరికొంత భాగం లీక్ అయ్యి సోషల్ మీడియాలోకి వచ్చేసింది. దానిలో ప్రభాస్ మొహం ఒక్కటే కనిపిస్తోంది. దానిలో నుదుటన విభూది రేఖలతో ప్రభాస్ చాలా గంభీరంగా ఉన్నారు.
దర్శకనిర్మాతలు విడుదల చేయక ముందే సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌లో కొంత ఈవిదంగా లీక్ అవడం సరికాదు. కనుక ఇప్పటికైనా ప్రభాస్ ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేస్తే మంచిది. లేకుంటే మిగిలినది కూడా ఇలాగే లీక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు కన్నప్ప టీమ్ కొత్తగా చెప్పుకోవడానికి, చూపుకోవడానికి ఏమీ మిగలదు.