ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ పూర్తిచేస్తున్నారు. రాజాసాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదలవుతుంది. ఈ మద్యలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్-2చేస్తున్నారు. మంచు విష్ణు చిత్రం ‘కన్నప్ప’లో ప్రభాస్ నందీశ్వరుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
వీటి తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకి కొబ్బరికాయ కొట్టేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చేసేందుకు ఎదురుచూస్తున్నారు.
ఈ రెండూ కాక నాగ్ అశ్విన్‌తో కల్కి-2 కూడా చేయాల్సి ఉంది. ప్రభాస్ కోసం ఇన్ని సినిమాలు లైన్లో ఉండగా సలార్ నిర్మాణ సంస్థ ‘హంబాలే ఫిలిమ్స్’ ఈరోజు ఓ ట్వీట్ చేసింది.
ప్రభాస్‌తో మరో మూడు సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించింది. 2026, 2027, 2028లో వరుసగా మూడు సంవత్సరాలలో వాటిని చేయబోతున్నట్లు ప్రకటించింది. వాటిని కూడా కలుపుకుంటే ప్రభాస్ 2028లోగా మొత్తం 9 సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
అప్పటికి రాజమౌళి-మహేష్ బాబు ప్రాజెక్ట్ పూర్తయితే 'బాహుబలి-3' మొదలుపెట్టవచ్చు. అది మొదలుపెడితే 2031 వరకు ప్రభాస్ బిజీగా ఉంటారు. అంటే ప్రభాస్ కాలంతో పోటీపడుతూ ఈ సినిమాలన్నీ పూర్తిచేయాలన్న మాట! ప్రభాస్ అభిమానులకు ఇంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది?
𝐌𝐚𝐝𝐞 𝐢𝐧 𝐈𝐧𝐝𝐢𝐚 𝐚𝐧𝐝 𝐁𝐮𝐢𝐥𝐭 𝐭𝐨 𝐋𝐚𝐬𝐭!#PrabhasXHombal3Films
We are proud to unite with the Rebel Star, #Prabhas, in a groundbreaking three-film partnership that celebrates the essence of Indian cinema and aims to take it to the world. This is a declaration of… pic.twitter.com/E4osJGaMgR