జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా వచ్చిన దేవర సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులకు శుభవార్త! నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ దేవర సినిమా ప్రసారం అవుతుందని నెట్‌ఫ్లిక్స్ సంస్థ స్వయంగా ప్రకటించింది.
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరకి మొదట మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్లతో దూసుకుపోయి రూ.500 కోట్లు పైగా వసూలు చేసింది. ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో రత్నగిరి అనే ప్రాంతంలో నాలుగు ఊర్లు ఉంటాయి.
కధేమిటంటే, మురుగ (మురళీశర్మ) గ్యాంగ్ విదేశాల నుంచి అక్రమంగా నౌకల ద్వారా ఆయుధాలు తీసుకువస్తుంటుంది. రత్నగిరి గ్రామ ప్రజల అవసరాల కోసం దేవర (జూ.ఎన్టీఆర్), భైర ఇద్దరూ తన గ్యాంగ్‌తో కలిసి సముద్రంలోకి వెళ్ళి ఆ ఆయుధాలను తెచ్చి మురగకి అప్పగించి డబ్బు సంపాదించుకుంటారు.
కానీ ఇది ఎప్పటికైనా తమకు ప్రమాదకరమవుతుందని భావించిన దేవర ఈ అక్రమ పనులు మానేసి సముద్రంలో చేపలు పట్టుకొని జీవిద్దామని నిర్ణయిస్తాడు. కానీ అది భైరకి నచ్చదు. కనుక దేవరని అడ్డుతొలగించుకొని అక్రమాయుధాల సరఫరాని తన అధీనంలో తీసుకోవాలనుకుంటాడు.
ఇది గ్రహించిన దేవర అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి భైర గ్యాంగ్ సముద్రంలోకి వెళ్ళాలంటేనే భయపడేలా చేస్తుంటాడు. దేవర కొడుకు వర (జూ.ఎన్టీఆర్) ప్రవేశం తర్వాత ఏం జరిగింది? అతనిని ప్రేమించిన తంగమ్ (జాన్వీ కపూర్) ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే.