రాజమౌళితో సినిమా మిస్ చేసుకున్నా: సూర్య

November 08, 2024


img

శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ కంగువా ఈ నెల 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిన్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు రాజమౌళి,బోయపాటి శ్రీను, నిర్మాతలు అల్లు అర్జున్‌ అరవింద్, డి. సురేష్ బాబు, నటులు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌ తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సూర్య అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ నేను రాజమౌళితో సినిమా (బాహుబలి) మిస్ చేసుకున్నాను. అందుకు నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. ఆ ట్రైన్ మిస్ చేసుకున్నప్పటికీ నేను ఇంకా స్టేషన్లో మరో ట్రైన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. రాజమౌళి హిమాలయాల అంతా ఎత్తు ఎదిగిపోయారు.

ఆయన బాటలో మేము పయనిస్తూ ఆ లక్ష్యాలు అందుకోవాలని నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాము. ఆయన భారతీయ సినిమాలను మరోస్థాయికి తీసుకువెళ్ళి అందరికీ స్పూర్తిదాయకంగా నిలిచారు. ఆ స్పూర్తితోనే ఈ కంగువా సినిమా చేశాము. ఇది తప్పకుండా అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను,” అంటూ రాజమౌళిపై ప్రశంశల వర్షం కురిపించారు. 

సూర్య గురించి రాజమౌళి ఏమన్నారంటే, “సూర్య నేను కలిసి ఓ సినిమా చేద్దామనుకున్నాము. కానీ కుదరలేదు. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, నటన నేను చాలా ఇష్టపడతాను. అలాగే సూర్య కధలు ఎంచుకుంటున్న తీరుని కూడా చాలా ఇష్టపడతాను. 

ఆయన తన ‘గజినీ’ సినిమాని ఇతర రాష్ట్రాలలో ఏవిదంగా ప్రమోట్ చేసుకున్నారో చూసిన తర్వాత దానిని ఓ ‘కేస్ స్టడీ’గా భావించి ఆధ్యయనం చేశాను. గజినీ స్పూర్తితోనే తెలుగు సినిమాలని ఇతర రాష్ట్రాలవారు కూడా ఆదరించేలా ఏవిదంగా తీయాలో నేను నేర్చుకున్నాను. నేను పాన్ ఇండియా మూవీలు తీయడానికి సూర్య చేసిన గజినీ సినిమాయే స్పూర్తి. 

కంగువా మేకింగ్ వీడియో చూసినప్పుడు ఆ సెట్స్‌లోనే వారి పనితనం, కష్టం కనిపించింది. కంగువా తప్పకుండా అన్ని భాషలలొ సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నాను,” అని రాజమౌళి అన్నారు.


Related Post

సినిమా స‌మీక్ష