ఘాటి నుంచి అనుష్క ఫస్ట్-లుక్ పోస్టర్‌

November 07, 2024


img

నేడు అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రధానపాత్ర చేస్తున్న ‘ఘాటి’ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. “ఆమె బాధితురాలు... క్రిమినల్... లిజెండ్... ఇప్పుడు ఘాటిని ఏలెందుకు వస్తున్నారు,” అంటూ ఆ పోస్టర్‌లో ఆమె పాత్ర గురించి క్లుప్తంగా చెప్పేశారు. 

అనుష్క శెట్టి గొప్ప నటి అని మరోసారి నిరూపిస్తున్నట్లుంది ఆ పోస్టర్‌. కంట్లో కన్నీటి చుక్క, ఆ కంట్లో రౌద్రం ఒకేసారి కనిపించడమే ఇందుకు నిదర్శనం. నుదుట గాయం నుంచి రక్తం కారుతుంటే, రక్తంతో తడిసిన చేతితో చుట్ట పట్టుకొని కాలుస్తున్నట్లున్న ఆమె పోస్టర్‌ చాలా ప్రత్యేకంగా ఆలోచింపజేసేలా ఉంది.

ఈ సినిమాకు సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్; కెమెరా: కాటసాని మనోజ్ రెడ్డి, ఆర్ట్: తోట తరణి, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా చేశారు. 

రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయి బాబు కలిసి ఈ సినిమా యూవీ క్రియెషన్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష