భారతీయ సినీ పరిశ్రమలో రామాయణ, మహాభారత గాధలను ఇప్పటివరకు ఎంతమంది ఎన్నిసార్లు సినిమాలుగా, టీవీ సీరియల్స్‌గా తీశారో లెక్కేలేదు. అయినా మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉన్నారు. తీసిన ప్రతీసారి ప్రజలు చూసి ఆస్వాదిస్తూనే ఉన్నారు.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో మరోసారి రామాయణం ఆధారంగా ‘రామాయణ’ పేరుతో మరో సినిమా సిద్దం అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్ శ్రీరాముడుగా, సన్నీ డియోల్, హనుమంతుడిగా, సాయిపల్లవి సీతమ్మవారిగా, కన్నడ నటుడు యష్ రావణుడుగా నటించబోతున్నట్లు సమాచారం.
ఈ నాలుగు పాత్రలకే సుమారు రూ.200 కోట్లు పారితోషికాలుగా చెల్లించబోతున్నట్లు సమాచారం. ఈ లెక్కన రెండు భాగాలుగా తీయబోతున్న ఈ సినిమా బడ్జెట్ ఎంతుంటుందో?
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీయబోతున్న రామాయణ మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేస్తామని తెలియజేస్తూ దర్శకుడు నితీష్ తివారీ రామబాణంతో ఓ పోస్టర్ విడుదల చేశారు.