కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన వెట్టాయన్ (తెలుగు వెర్షన్ పేరు కూడా ఇదే) సినిమాలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి వంటి హేమాహేమీలు నటించారు. తెలుగులో విడుదల చేస్తున్నప్పుడు పేరు మార్చకుండా ‘వెట్టాయన్’ పేరుతోనే ఈ సినిమాని విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ సినిమా కధ బాగుందటంతో ప్రేక్షకాధరణ పొంది నిర్మాతలకి కలక్షన్స్ కనకవర్షం కురిపిస్తోంది.
ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా పేరున్న ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ (రజినీకాంత్) ఓ టీచర్ హత్య కేసులో విచారణ జరిపి హంతకుడిని ఎన్‌కౌంటర్‌గానే చేస్తాడు. ఇంతవరకే కధ అయితే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా మిగిలిపోయేది. కానీ ఎంకౌంటర్ చేయబడిన వ్యక్తి హంతకుడు కాదని తెలిస్తే?ఆ తర్వాత దీనిపై కోర్టులో విచారణ జరిగితే?అనేది సినిమాని మరోస్థాయికి చేర్చించింది.
అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నవంబర్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ప్రసారం కాబోతోంది.