మాస్ మహారాజ రవితేజ బొగ్గవరపు భాను దర్శకత్వంలో చేస్తున్న సినిమా పేరు ‘మాస్ జాతర’ ట్యాగ్ లైన్ ‘మనదే ఇదంతా ’ అని ప్రకటించారు. దీపావళి కానుకగా టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
జయంట్ వీల్ ఎదుట చేతిలో గంట, ఫ్యాంట్‌లో రివాల్వర్‌తో రవితేజ ఈసారి ఏదో మ్యాజిక్ చేయబోతున్నట్లే కనిపిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మిగిలిన నటీనటుల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్: నవీన్ నూలి చేయబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీకార స్టూడియోస్ సమర్పిస్తుంది. వచ్చే ఏడాది మే 9వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.