ప్రశాంత్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వచ్చిన ‘హనుమాన్’ సూపర్ హిట్ అవడంతో వెంటనే ‘జై హనుమాన్’ అనే మరో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. రేపు దీపావళి పండుగ కానుకగా ఆ సినిమా నుంచి ఓ అద్భుతమైన పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో హనుమంతుడిగా కన్నడ నటుడు రిషబ్ శెట్టి చేయబోతున్నట్లు ఆ పోస్టర్‌తోనే తెలియజేశారు.
వెనుక నుంచి సూర్యకిరణాలు పడుతుండగా హనుమంతుడు శ్రీరాముడి విగ్రహం పట్టుకుని కూర్చొన్న పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. ఈ హనుమంతుడికి తోక ఉంది కానీ మొహం మాత్రం చూడముచ్చటగా ఉంది.
“త్రేతాయుగంలో ఇచ్చిన మాట కలియుగంలో నెరవేరుతుంది. విధేయత, ధైర్యం, భక్తితో కూడిన ఇతిహాసగాధని మీ ముందుకు తీసుకువస్తున్నాము. ప్రశాంత్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందంటూ రిషబ్ శెట్టి ట్వీట్ చేశారు.
ఈ సినిమాని నవీన్ ఎర్నేని, వైసీపి రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది.