నందమూరి కుటుంబం నుంచి మరో హీరో

October 30, 2024


img

నందమూరి కుటుంబం నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమారుడు స్వర్గీయ జానకీ రామ్ కుమారుడు పేరు కూడా నందమూరి తారక రామారావే. కనుక జూ.ఎన్టీఆర్‌-2 అని పిలుచుకుందాం.    

దర్శకుడు వైవీఎస్ చౌదరి జూ.ఎన్టీఆర్‌-2ని హీరోగా పరిచయం చేయబోతున్నారు. న్యూ టాలెంట్ రోర్స్@ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్‌: 1గా యలమంచిలి గీత నిర్మించబోతున్న ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌-2కి హీరోయిన్‌గా కూచిపూడి డాన్సర్ వీణారావు చేయబోతున్నారు. ఈ సినిమాకు సంగీతం: ఎంఎం కీరవాణి, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర అందించబోతున్నారు. 

ఇప్పటికే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరోగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇప్పుడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ మనుమడు జూ.ఎన్టీఆర్‌-2 కూడా వస్తుండటంతో నందమూరి కుటుంబం నుంచి ఒకేసారి ఇద్దరు యువహీరోలు సినీ రంగంలో ప్రవేశిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు త్వరగా నిలద్రొక్కుకొని మంచి పేరు సంపాదించుకుంటారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. 

జూ.ఎన్టీఆర్‌-2ని పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్‌ అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష