నాగ చైతన్య-శోభు దూళిపాళల వివాహ నిశ్చితార్ధం అయినప్పటి నుంచి వారి వివాహం ఎప్పుడాని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవలే శోభిత ధూళిపాళ ఇంట్లో పసుపు దంచడంతో పెళ్ళి పనులు మొదలుపెట్టారు.
కనుక నేడో రేపో వారి పెళ్ళి తేదీ ప్రకటిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్‌లో వారి వివాహం జరుగబోతోంది. కనుక పెళ్ళికి రెండు ముందుగా అంటే డిసెంబర్ 2వ తేదీన సంగీత్, 3వ తేదీన మెహందీ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం.
పెళ్ళికి ఇరుకుటుంబాల బంధుమిత్రులు, టాలీవుడ్‌లో కొందరు ప్రముఖులను మాత్రమే ఆహ్వానించి నిరాడంబరంగా జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్‌లో భారీ రెసిప్షన్ పార్టీ ఏర్పాటు చేసి దానికి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులను, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. నేడో రేపో ఈ మేరకు అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇటీవల జరిగిన అక్కినేని నాగేశ్వరరావు అవార్డుల ప్రధానోత్సవంలో అక్కినేని నాగార్జున తన కాబోయే కోడలు శోభిత ధూళిపాళని చిరంజీవి తదితర సినీ ప్రముఖులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారు నాగ చైతన్య-శోభు దూళిపాళల పెళ్ళి గురించి అడిగినప్పుడు ఈ విషయం బయటపడిన్నట్లు తెలుస్తోంది.