చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘తండేల్’ సినిమా జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదల కావలసి ఉంది. ఆ ప్రకారమే సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ ప్లాన్ చేసుకొని ముందుకు సాగుతున్నామని దర్శకుడు చందు మొండేటి చెప్పారు.
అయితే జనవరిలో రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్, వెంకటేష్ సినిమా విడుదల కాబోతున్నాయి. కనుక వాటి కోసం తండేల్ కాస్త వెనక్కు జరుపుకోవలసి రావచ్చని చందు మొండేటి చెప్పారు.
సినిమా రిలీజ్ వాయిదా వేసుకోవలసి వస్తే జనవరి 26 ఆదివారం పడింది కనుక అప్పుడూ సాధ్యపడదని ఫిబ్రవరిలో విడుదల చేసుకోవలసి వస్తుందని అన్నారు. అయితే కాస్త ముందుకు జరిపి డిసెంబర్‌లో క్రిస్మస్ పండుగ ముందు విడుదల చేయవచ్చు కదా?అని ఓ విలేఖరి ప్రశ్నించగా, అప్పటికి తమ సినిమా పనులు పూర్తికావు కనుక సాధ్యం కాదని చెప్పారు.
ప్రస్తుతం మరో 10 రోజులు షూటింగ్ మిగిలి ఉంది. అది పూర్తిచేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం అవసరం. కనుక వీలైతే జనవరిలో సంక్రాంతి పండుగకు తండేల్ విడుదలకు సిద్దంగానే ఉంటుందని, కానీ అప్పుడు వాయిదా పడితే మళ్ళీ ఫిబ్రవరి వరకు సాధ్యపడదని చందూ మొండేటి స్పష్టం చేశారు.