వెంకటేష్-అనిల్ రావిపూడి సినిమా అప్‌డేట్‌

October 27, 2024


img

వెంకటేష్-అనిల్ రావిపూడి కలిసి చేస్తున్న సినిమా అప్‌డేట్‌ ఇచ్చింది శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్. ఎస్‌వీసీ58 వర్కింగ్ టైటిల్‌తో సిద్దం అవుతున్న ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్-లుక్ పోస్టర్‌ త్వరలో విడుదల చేస్తామని నేడు ట్వీట్‌ చేసింది. ఈ సినిమా షూటింగ్‌ 90 శాతం పూర్తయిందని, ప్రస్తుతం డబ్బింగ్ వర్క్ మొదలైందని తెలిపింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయని తెలిపింది. 

శంకర్-రామ్ చరణ్‌ కాంబో గేమ్ ఛేంజర్‌ కూడా సంక్రాంతికి విడుదల కాబోతోంది. దానికీ నిర్మాత దిల్‌రాజే కనుక గేమ్ ఛేంజర్‌ వలన వెంకటేష్ సినిమా దెబ్బ తినకూడదని కోరుకుంటారని కనుక ఈ సినిమాని వాయిదా వేసుకుంటారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎస్‌వీసీ58ని కూడా సంక్రాంతి పండుగకే విడుదల చేయబోతున్నామని నిర్మాత దిల్‌రాజు స్పష్టం చేశారు. ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అని టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ చేస్తున్నారు.  

 ఈ సినిమాకు కధ: ఎస్‌.కృష్ణ, జీ ఆదినారాయణ,  సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు అందిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష