వారం హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్స్ లో పొట్టేల్ సినిమా సక్సస్ మీట్‌లో సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ సినిమా రివ్యూలు వ్రాసేవారిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. దీనిపై ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరపున ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మినారాయణ స్పందిస్తూ, ‘మా’ అధ్యక్షుడు మంచువిష్ణుకి ఓ లేఖ వ్రాశారు.
నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో శ్రీకాంత్ అయ్యంగర్ చాలా అసభ్యకరంగా తమని ఉద్దేశ్యించి మాట్లాడారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. ఆయన మాటలతో సినీ జర్నలిస్టుల మనోభావాలు దెబ్బ తిన్నాయని, కనుక ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో లక్ష్మినారాయణ కోరారు.
పొట్టేల్ సక్సస్ మీట్‌కి సినీ జర్నలిస్టులు కూడా చాలా మంది హాజరయ్యారు. వారి సమక్షంలోనే శ్రీకాంత్ అయ్యంగార్ వారిని దూషిస్తూ, ఇలాంటి చీడ పురుగులను ఏరి పారేయాలని మాట్లాడటంతో వారి మనోభావాలు దెబ్బ తినడం సహజమే. అందుకు ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే వారి అసోసియేషన్ తరపున ‘మా’ అధ్యక్షుడు మంచువిష్ణుకి ఆయనపై ఫిర్యాదు చేస్తూ లేఖ వ్రాశారు.
.@iVishnuManchu pic.twitter.com/7LtAPwHuPy