సారంగపాణి జాతకం... ఫస్ట్ లిరికల్

October 27, 2024


img

ప్రియదర్శి, రూప కొడువయూర్ జంటగా ‘సారంగపాణి జాతకం’ సినిమా సిద్దం అవుతోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ విడుదలైంది. సారంగో సారంగా అంటూ హుషారుగా సాగే ఈ పాటని రామజోగయ్య శాస్త్రి వ్రాయగా దానిని వివేక్‌ రామస్వామి సాగర్ స్వరపరిచి సంగీతం అందించారు. ఈ మెలోడియస్ పాటని అర్మాన్‌ మాలిక్ హుషారుగా పాడారు.

ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వివా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, వికె నరేశ్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేశ్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కెఎల్‌కె మణి, ఐమాక్స్ వెంకట్ ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ, సంగీతం: వివేక్‌ రామస్వామి సాగర్, కెమెరా: పీజీ విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, స్టంట్స్‌: వెంకట్, వెంకటేష్ చేశారు.

శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 20న విడుదల కాబోతోంది.              


Related Post

సినిమా స‌మీక్ష