సుకుమార్-అల్లు అర్జున్-రష్మిక మందన కాంబినేషన్‌లో పుష్ప-2 డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా గురించి సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11,500 థియేటర్లలో ఒకేసారి ఆరు భాషల్లో విడుదల కాబోతోంది. వాటిలో భారత్‌లో 6,500 థియేటర్లు, విదేశాలలో 5,000 థియేటర్లలో విడుదల కాబోతోంది.
ఇంతవరకు ఏ భారతీయ సినిమా ఒకేసారి ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదు. కనుక పుష్ప-2 సరికొత్త రికార్డ్ సృష్టించబోతోంది. ఒకేసారి ఇన్ని థియేటర్లలో సినిమా విడుదల చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు.
దీనిలో ఎంత రిస్క్ ఉందో అంతే లాభం కూడా ఉంటుంది. సుకుమార్, అల్లు అర్జున్ కలిసి పుష్ప-2 మొదటి భాగంలో మ్యాజిక్ చేశారు. కనుక పుష్ప-2పై చాలా భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు ఒకేసారి ఇన్ని థియేటర్లలో సినిమా విడుదల చేస్తుండటంతో కలక్షన్స్ కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. అవి కూడా రికార్డ్ బ్రేక్ చేయడం ఖాయమే.
‘పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపీ, జగపతిబాబు నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.