యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ళ తదితరులు ప్రధాన పాత్రలలో పొట్టేల్ సినిమా శుక్రవారం విడుదలైంది. సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ, సినిమా కాస్త సాగదీసిన్నట్లు ఉండటంతో నెగెటివ్ రివ్యూలు వ్రాశారు.
ఈ సినిమా సక్సస్ మీట్ శనివారం హైదరాబాద్‌లో జరిగినప్పుడు, ఈ సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా రివ్యూలు వ్రాసేవారిని నోటికి వచ్చిన్నట్లు తిట్టిపోశారు. కనీసం షార్ట్ ఫిలిమ్ కూడా తీయడం చాతకని వెదవలు కూడా ఎంతో కష్టపడి తీసిన సినిమాల గురించి ఇష్టం వచ్చిన్నట్లు రివ్యూలు వ్రాసి పడేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ సినిమా తీయడానికి ఎంతో మంది ఎన్నో నెలలపాటు రేయింబవళ్ళు కష్టపడతారని, ప్రతీ ఒక్కరూ మంచి సినిమాయే తీయాలని, తీస్తున్నామనే నమ్మకంతోనే పనిచేస్తారని శ్రీకాంత్ అయ్యంగార్ అన్నారు.
సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని లేకుంటే లేదని కానీ మద్యలో సినిమాలపై తీర్పులు చెప్పడానికి రివ్యూలు వ్రాసేవాళ్ళు ఎవరని ప్రశ్నించారు. ఇటువంటి చీడపురుగులను ఏరి పారేయలని అప్పుడే సినిమాలు ఆడగలుగుతాయని అన్నారు.
అంతకు ముందు ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా ప్రతినిధులు దర్శకుడు సాహిత్ మోత్కూరిని సినిమా సాగతీత గురించి పదేపదే ప్రశ్నించినా ఆయన చాలా ఓపికగా సంయమనం కోల్పోకుండా సమాధానాలు చెప్పారు. కానీ చివరిలో మైక్ అందుకున్న శ్రీకాంత్ అయ్యంగార్ నోటికి హద్దే లేదన్నట్లు మాట్లాడారు. ఆయన తీరుపై మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Adhi atla thengu#pottelmovie pic.twitter.com/WYmSvtyOji