ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాజాసాబ్ మోషన్ పోస్టర్ విడుదల చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. దానిలో ప్రభాస్ కాస్త నెరిసిన గడ్డంతో సిగార్ కాల్చుకుంటూ కూర్చున్నట్లు చూపారు. డార్లింగ్ ప్రభాస్‌ని పుట్టినరోజునాడు అలా ముసలి వేషంలో మారుతి చూపుతారని బహుశః ఎవరూ ఊహించి ఉండరు కనుక మిశ్రమ స్పందన వస్తోంది.
ఇదివరకు విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్‌లో ప్రభాస్‌ని చాలా అందగాడైన యువకుడిగా చూపారు కనుక దీంతో ప్రభాస్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు మారుతి చెప్పేశారని భావించవచ్చు.
ప్రభాస్ ఇంతవరకు ద్విపాత్రాభినయం చేయలేదు కనుక అభిమానులకు ఇది చాలా సంతోషకరమైన వార్తే కానీ ఈ పోస్టర్ వేరే రోజు విడుదల చేసి, ఇవాళ్ళ పుట్టినరోజునాడు ఇదివరకులా చక్కటి మోషన్ పోస్టర్ విడుదల చేస్తే బాగుండేదనిపిస్తుంది.