నందమూరి బాలకృష్ణలో మరో కోణం పరిచయం చేసిన కార్యక్రమం ఆహా ఓటీటీలో ప్రసారం అయిన అన్ స్టాపబుల్ టాక్ షో. ఆయన సినిమాలలో ఎక్కువగా గంభీరమైన పాత్రలే చేస్తుంటారు. కానీ అన్ స్టాపబుల్ టాక్ షోలో ఆయన హాస్య చతురత బయటపడింది. బాలయ్యని ఆవిదంగా చూసి అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. చాలా ఆనందించారు.
బాలయ్య కారణంగానే అన్ స్టాపబుల్ టాక్ షో మూడు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. కనుక ఈ నెల 24నుంచి నాలుగో సీజన్‌కి సిద్దం అవుతున్నారు. ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలకు కూడా ప్రమోలు, టీజర్‌లు, ట్రైలర్‌లు వచ్చేస్తున్నాయి.
కనుక అన్ స్టాపబుల్ సీజన్-4కి కూడా ట్రైలర్ విడుదల చేశారు. అయితే అది కూడా రొటీన్‌కి భిన్నంగా యానిమేషన్ ట్రైలర్ కావడం విశేషం. దానిలో బాలయ్య పరిచయం, చివరిగా బాలయ్య అసలు రూపంలో చెప్పిన పంచ్ డైలాగులు చాలా అలరిస్తాయి.
ఇప్పటికే ఈ సీజన్‌లో-4లో మొదటి రెండు ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, దర్శకుడు గోపీ చంద్ మలినేనిలతో ఒక ఎపిసోడ్, అల్లు అర్జున్‌తో ఒక ఎపిసోడ్ చేసిన్నట్లు తెలుస్తోంది.