అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కాదు... నవంబర్‌ 8న రిలీజ్

October 11, 2024


img

సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ చేస్తున్న మూడో సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో,’ టీజర్‌ విడుదలైంది. ఈ సినిమాలో నిఖిల్ రేసర్‌గా చేస్తున్నాడు. ఓ పెద్ద ప్లాన్‌తో లండన్‌ వెళ్ళి అక్కడ చిక్కులో పడతాడు. అక్కడే హీరోయిన్‌ రుక్మిణీ వసంత్ పరిచయం అవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. ఈ సినిమాని నవంబర్‌ 8వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు టీజర్‌లో చెప్పేశారు.  

ఈ సినిమాలో దివ్యాంషు కౌశిక్, హర్ష చెముడు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: సన్నీ ఎంఆర్, పాటలకు సంగీతం: కార్తీక్ అందిస్తున్నారు. కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్: వెంకట్, కెవిన్ స్మిత్, టిడిపి జేమ్స్ అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ ఈ సినిమా నిర్మిస్తున్నారు.   



Related Post

సినిమా స‌మీక్ష