శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీ చంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన ‘విశ్వం’ సినిమా శుక్రవారం భారీ అంచనాల నడుమ విడుదలైంది. సినిమాలో దర్శకుడు శ్రీను వైట్ల మార్క్ కామెడీ, గోపీ చంద్ రొమాన్స్, యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ శ్రీను వైట్ల-గోపీ చంద్ కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందని అనుకుంటే సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ పండగ సీజన్‌లో విశ్వానికి పెద్దగా పోటీ కూడా లేదు కనుక ఒడ్డున పడగలదు.
ఈ సినిమా విడుదల కాకమునుపే గోపీ చంద్ ఓ కొత్త దర్శకుడు చెప్పిన కధకి ఓకే చెప్పారు. ఈ సినిమాని యూవీ క్రియెషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబందించి పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.