ఫ్లాప్ అయితేనేం శ్రీవిష్ణుతోనే మరో సినిమా!

October 09, 2024


img

శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలై బోర్లా పడిన సినిమా స్వాగ్. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఆ సంస్థకు ఎంతో కొంత నష్టమే వస్తుంది. కనుక ఇప్పట్లో శ్రీవిష్ణుతో మరో సినిమా చేయదని అందరూ అనుకుంటే ఆ సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ శ్రీవిష్ణుతోనే మరో సినిమా చేసేందుకు సిద్దమవుతుండటం విశేషం.

తమ సంస్థలో ఏ హీరోతో  సినిమా చేసినా అతనితో కనీసం రెండు మూడు సినిమాలకు తక్కువ కాకుండా తీయడం ఆయన అలవాటు. సినిమాలు హిట్ అయితే సంతోషం ఫ్లాప్ అయినా భయపడే ప్రసక్తే లేదంటారు టీజీ విశ్వప్రసాద్.

స్వాగ్ సినిమా నరేషన్ సరిగా లేకపోవడంతో అంతా గందరగోళంగా సాగింది. అందువల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది. కానీ ఆ ప్లాట్, ఆ కామెడీకి సినిమా సూపర్ హిట్ అయ్యి ఉండేదే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్వాగ్ పూర్తి బాధ్యత శ్రీవిష్ణు తీసుకుని ఆ సినిమాని అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న సమయానికి పూర్తిచేసినందుకు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కి అతనిపై పూర్తి నమ్మకం ఏర్పడిన్నట్లు టాక్. అందుకే శ్రీవిష్ణుతో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసిన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కధ మొత్తం అమెరికాలో జరిగిన్నట్లు ఉండబోతోందట! ఇదే నిజమైతే స్వాగ్ కంటే ఇంకా భారీ బడ్జెట్‌తోనే ఈ సినిమా తీయబోతున్నట్లు భావించవచ్చు. త్వరలోనే వారి సినిమా గురించి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష