అమీర్ ఖాన్‌తో వంశీ పైడిపల్లి హిందీ సినిమా?

October 08, 2024


img

ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమ పాన్ ఇండియా సినిమాలతో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తోంది. ఇక బాహుబలి, ఆరాఆర్ఆర్, హనుమాన్ వంటి సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకున్నాయి. అందువల్లే ఇప్పుడు బాలీవుడ్‌ హీరోలు తెలుగుతో సహా దక్షిణాది సినిమాలలో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అదేవిదంగా దక్షిణాది హీరోలు హిందీ సినిమాలలో నటిస్తున్నారు. 

దేవర సినిమాలో జాన్వీ కపూర్‌, సైఫ్ ఆలీ ఖాన్ నటించగా, జూ.ఎన్టీఆర్‌ హిందీలో నిర్మిస్తున్న వార్-2 సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే.  

అలాగే మన దక్షిణాది దర్శకులు సైతం బాలీవుడ్‌ హీరోలతో హిందీ సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా సందీప్ వంగా దర్శకత్వంలో తీసిన ‘డెవిల్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

ఇప్పుడు టాలీవుడ్‌ నుంచి మరో దర్శకుడు వంశీ పైడిపల్లి బాలీవుడ్‌ సీనియర్ నటుడు అమీర్ ఖాన్‌కి ఓ కధ చెప్పగా ఆయన ఓకే చెప్పిన్నట్లు తాజా సమాచారం. ఈ డిసెంబర్‌లోగా వారి ఈ సినిమాకి సంబందించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష