శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్‌లో గేమ్ ఛేంజర్ సినిమాకి సంగీతం అందిస్తున్న ధమన్ రెండు అప్‌డేట్స్ ఇచ్చారు. దసరాకి ఈ సినిమా టీజర్ రావట్లేదాని నిరాశచెందవద్దని దీపావళికి తప్పకుండా టీజర్ విడుదల చేస్తామని ట్వీట్ చేశారు.
ఈ నెల 30వ తేదీన గేమ్ ఛేంజర్ నుంచి మూడో పాట విడుదల చేయబోతున్నట్లు తమన్ తెలిపారు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ ఫైనల్ ఎడిటింగ్ పనులు చురుకుగా జరుగుతున్నాయని. డబ్బింగ్ వగైరా పనులన్నీ సమాంతరంగా సాగుతున్నాయని తమన్ తెలిపారు. అన్ని పాటలకు లిరికల్ వర్క్స్ పూర్తిచేశామని చెప్పారు. గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20వ తేదీన ఖచ్చితంగా విడుదల కాబోతోందని తమన్ తెలియజేశారు.
ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా కియరా అద్వానీ చేయగా మరో పాత్రకు భార్యగా అంజలి చేసింది. ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేశారు. శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ కలిసి గేమ్ ఛేంజర్ సినిమా నిర్మించారు.