షూటింగ్‌ నుంచి ఎందుకు పారిపోయావు... ప్రకాష్ రాజ్‌?

October 06, 2024


img

శనివారం చెన్నైలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. దానిలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌, ప్రకాష్ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్‌  ఉదయనిధి స్టాలిన్‌ పక్కనే కూర్చొని ఫోటో దిగి జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

దానిపై ‘మార్క్ ఆంటోనీ’ సినీ నిర్మాత వినోద్ కుమార్‌ స్పందిస్తూ, “ప్రకాష్ రాజ్‌ నీపక్కన కూర్చున్న ముగ్గురూ ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. కానీ నువ్వు డిపాజిట్లు కోల్పోయారు. వారికీ నీకు అదే తేడా! ఓ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు చెప్పా పెట్టకుండా హటాత్తుగా వెళ్ళిపోయావు. తిరిగి రాలేదు. తర్వాత కలిసి కారణం చెపుతానన్నావు. కానీ చెప్పలేదు. ఆ రోజు నువ్వు అలా చేయడం వలన షూటింగ్‌ నిలిచిపోయి కోటి రూపాయలు నష్టపోయాను. ఆరోజు అలా చెప్పకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? #జస్ట్ ఆస్కింగ్” అని ప్రకాష్ రాజ్‌ స్టైల్లోనే ప్రశ్నించారు. 

ఇతరులలో లోపాలు వెతికి ప్రశ్నించే ప్రకాష్ రాజ్‌ నిర్మాతకి ఎందుకు నష్టం కలిగించారు? నిర్మాత ప్రశ్నకు ఏమని సమాధానం చెపుతారో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష