విశాఖ వాసు కధ: మట్కా... టీజర్‌

October 06, 2024


img

కరుణా కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ 'మట్కా' అనే ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా టీజర్‌ నిన్న విడుదలైంది. 1958-1982 మద్య కాలంలో యావత్ దేశాన్ని కుదిపేసిన మట్కా జూదం నేపధ్యంలో క్రైమ్, యాక్షన్ మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. 

రెండు నిమిషాల టీజర్‌లో పంచ్ డైలాగులు, వరుణ్ తేజ్ గెటప్, నటన రెండూ అద్భుతంగా ఉన్నాయి. అలాగే  జీవీ ప్రకాష్ అందించిన సంగీతం, సినిమా సెట్స్‌, లైటింగ్ వగైరా అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి.  

“ఈ దేశంలో చ‌లామ‌ణీ అయ్యే ప్ర‌తీ రూపాయిలో 90 పైస‌లు నూటికి ఒక్క‌డే సంపాదిస్తాడు. మిగ‌తా ప‌ది పైస‌ల కోసం 99 మంది కొట్టుకొంటారు. నువ్వు 90 పైస‌లు సంపాదించే ఒక్క‌డివి. 99 మందిలో ఒక్క‌డిలా మిగిలిపోకు. నీకా ద‌మ్ముంది,”

“ధర్మం... మ‌న‌కు ఏది అవ‌స‌ర‌మో అదే ధర్మం. మ‌నిషిలో ఆశ చావ‌నంత వ‌ర‌కూ నా యాపారానికి చావు ఉండ‌దు.”

“విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకు రావాలి లేదా ఈ వాసు గుర్తురావాలి,” వంటి డైలాగులు మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. 

ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా చేస్తోంది. నోరా ఫతే, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, మీడియాతో మాట్లాడుతూ, “ గోపీ, రూపాలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరన్‌దాస్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కరుణ కుమార్, పాటలు: భాస్కరభట్ల రవి కుమార్, లక్ష్మి భూపాల; సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్; కొరియోగ్రఫీ: జానీ మాస్టర్‌, సతీష్ కృష్ణన్, విజయ్‌ పోలాకి, విజయ్‌ సాగర్; కెమెరా: ఏ కిషోర్ కుమార్; జానా; స్టంట్స్‌: విజయ్‌ మాస్టర్, రామ్ సుంకర, నిఖిల్; ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు. 

వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్,ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై డాక్టర్ తీగల విజయేందర్ రెడ్డి, రజని తాళ్ళూరి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. మట్కా నవంబర్‌ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.         



Related Post

సినిమా స‌మీక్ష