జూ.ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదలై సూపర్ హిట్ మృణాల్ ఠాకూర్ సొంతం చేసుకొంది. ఈ పది రోజులలో రూ.405 కోట్లు పైగా కలక్షన్స్ రాబట్టి ఇంకా దూసుకుపోతోంది. కనుక అభిమానులు అందరూ దేవర-2 ఎప్పుడని ఆలోచించడం మొదలుపెట్టారు.
అయితే దేవర మొదటి భాగం చేస్తున్నప్పుడు జూ.ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ‘వార్-2’ అనే పాన్ ఇండియా మూవీని మొదలుపెట్టారు. కనుక ముందుగా దానిని పూర్తి చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది.
కనుక ఈ రెండు పూర్తయ్యి విడుదలయ్యే సరికి ఎంత లేదన్నా కనీసం ఏడాదిన్నర పైనే పడుతుంది. అంటే 2026 సెప్టెంబర్, అక్టోబర్ మద్య దేవర 2 మొదలుపెట్టే అవకాశం ఉంది.
కొరటాల శివ ఇప్పటికే దేవర-2 కధ పూర్తి చేసిన్నట్లు తెలుస్తోంది. కనుక 2026 వరకు జూ.ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చోలేరు కనుక ఆలోగా ఆయన కూడా వేరే హీరోలతో ఒకటో రెండో సినిమాలు మొదలుపెట్టి పూర్తి చేసేయొచ్చు.
ఒకవేళ దేవర-2 2026 సెప్టెంబర్ లేదా ఇంకా ముందుగానే మొదలుపెట్టినా అది పూర్తి చేసేందుకు కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ళు సమయం పడుతుంది.
కనుక దేవర-2 బహుశః 2028-2029 మద్య ఎప్పుడో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆలోగా జూ.ఎన్టీఆర్ చేస్తున్న వార్-2 సినిమా రిలీజ్ అవుతుంది కనుక దాంతో సర్దుకుపోవలసిందే.
#Devara Part 2 will be BIGGER & BETTER 🔥🔥🔥🤙🏻🤙🏻🤙🏻 pic.twitter.com/48HzILBVI2