మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్న నటీనటుల ఫస్ట్-లుక్ పోస్టర్లు ఒకటొకటిగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి కూడా నటిస్తున్నారు. వారిని పరిచయం చేస్తూ అడవిలో చెట్టు చాటు నుంచి తొంగి చూస్తున్న వారి ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో వారి పాత్రలు పేర్లు పిలక, గిలక అని చెప్పేశారు.
“చేపకి ఈత, పులికి వేట, కోకిలకి పాట నేర్పిన గుగ్గురువులు... అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే...” అంటూ వారి గురించి చిన్నగా పరిచయం కూడా ఇచ్చారు. అయితే మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సినిమాలో ఒక్కో పాత్రని ఈవిదంగా పరిచయం చేస్తున్నప్పటికీ పెద్దగా ఎవరినీ ఆకర్షించడం లేదు. ఉంటే సోషల్ మీడియాలో ఈపాటికి కన్నప్పకి హైప్ క్రియేట్ అయ్యి ఉండేది.
కన్నప్పలో బాలీవుడ్ నటి నుపూర్ సనన్ మంచు విష్ణుకు జోడీగా నటిస్తోంది. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా నటిస్తున్నారు. ప్రభాస్ నందీశ్వరుడుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబు, శరత్ కుమార్, నయనతార, మధుబాల, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
కన్నప్ప సినిమాకు సంగీతం: మణిశర్మ మరియు స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్ డైరెక్టర్: చిన్న చేస్తున్నారు.
ఈ సినిమాపై నమ్మకంతో బారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నిర్మిస్తున్నారు. కన్నప్ప ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.