కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అపోలో ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు తగు చికిత్స అందించడంతో కోలుకుంటున్నారని సమాచారం.
కానీ ఆయనని ఆస్పత్రిలో చేర్చడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిపై రజనీకాంత్ భార్య లత స్పందిస్తూ ఆయనకేమీ కాలేదని, ఆరోగ్యంగానే ఉన్నారని నేడో రేపో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగివస్తారని చెప్పారు. కనుక ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ లేనిపోని పుకార్లు పుట్టించవద్దని ఆమె అభ్యర్ధించారు.
ఆయన నటించిన వేట్టయన్ ఈ నెల 10వ తేదీన విడుదల కాబోతుండగా కూలీ చిత్రం ఇంకా నిర్మాణ దశలో ఉంది. వాటి తర్వాత మరో రెండు సినిమాలు ఒప్పుకున్నట్లు సమాచారం. రజినీకాంత్ వయసు 73 ఏళ్ళు. ఈ వయసులో కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తుండటంతో బహుశః శారీరిక, మానసిక ఒత్తిడి పెరిగిపోయి ఉండవచ్చు.