తెలంగాణలో మరో లైంగిక వేధింపు కేసు నమోదు

September 29, 2024


img

లైంగిక వేధింపు కేసులో టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ ప్రస్తుతం చంచల్‌గూడా జైల్లో ఉండగానే రాష్ట్రంలో మరో లైంగిక వేధింపు కేసు నమోదు అయ్యింది. ఈసారి జానపద పాటలు పడే గాయని మల్లిక్ తేజ్ యూట్యూబర్‌ హర్ష సాయిపై జగిత్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

అతను మాయమాటలు చెప్పి తనను శారీరికంగా లొంగదీసుకొని పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది. తాను ఎదురుతిరగడంతో రోజూ ఫోన్‌ చేసి తనని, తల్లి తండ్రులని కూడా బూతులు తిడుతూ వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇటీవలే అతనిపై హైదరాబాద్‌లో మరో యువతి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలుగు సినిమా అవకాశాల కోసం ముంబై నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఆమెతో హర్ష సాయి పరిచయం పెంచుకొని ప్రేమ పేరుతో అత్యాచారం చేశాడని, తన వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కూడా తీసుకున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు అతనిపై జగిత్యాల పోలీసులు కూడా మరో కేసు నమోదు చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష