గేమ్ ఛేంజర్‌ రా మచ్చ మచ్చా... ప్రమో రిలీజ్

September 28, 2024


img

రామ్ చరణ్‌-శంకర్ కాంబినేషన్‌లో ‘గేమ్ ఛేంజర్‌’ సినిమా నుంచి ‘రా మచ్చ మచ్చా...’ అంటూ సాగే రెండో పాట ప్రమో కొద్ది సేపటి క్రితం విడుదలైంది. అనంత్ శ్రీరామ్ వ్రాసిన ఈ పాటని ధమన్ స్వరపరచగా నాకాశ్ అజీజ్ హుషారుగా పాడారు. పాట కంటే ఈ పాటకి రామ్ చరణ్‌ బృందం చేసిన డాన్స్ చాలాకలర్ ఫుల్‌గా ఉంది. పూర్తి పాట ఈ నెల 30వ తేదీన విడుదల కాబోతోంది.   

రామ్ చరణ్‌, కియరా అద్వానీ, అంజలి, ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్‌.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. 

శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ కలిసి గేమ్ ఛేంజర్‌ సినిమా నిర్మిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 20వ తేదీన విడుదల కాబోతోంది. 

    


Related Post

సినిమా స‌మీక్ష