ఆహాలో చిన్న కధ కాదు... ఎప్పటి నుంచంటే

September 27, 2024


img

ఎటువంటి అంచనాలు లేకుండా మంచి ప్రేక్షకాధరణ పొందుతున్న అనేక చిన్న సినిమాలు వస్తున్నాయి. వాటిలో ‘35 చిన్న కధ కాదు’ సినిమా కూడా ఒకటి. నందా కిషోర్ ఇమాని దర్శకత్వంలో నివేదా ధామస్, విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి ప్రదాన పాత్రలలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్‌ 6వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

చిన్న కధ కాదు అంటూనే తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమాని తెరకెక్కించి విడుదల చేస్తే సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతోంది. 

కధ ఏమిటంటే... తిరుపతిలో నివాసం ఉంటున్న ప్రసాద్ (విశ్వదేవ్ రాచకొండ), సరస్వతి (నివేదా థామస్), వారి ఇద్దరు పిల్లలు... ఓ సామాన్య మద్య తరగతి కుటుంబం. తన భర్త, పిల్లలే ప్రపంచంగా సరస్వతి జీవిస్తుంటుంది. వారి పెద్ద పిల్లాడు అరుణ్ అడిగే ప్రశ్నలకు లెక్కల మాస్టర్‌ (ప్రియదర్శి) జవాబు చెప్పలేక ఎందుకు పనికి రాడని చెప్పి వెనుక బెంచీలో కూర్చోపెడతాడు. అరుణ్ స్కూల్లో చదువుకోవాలంటే లెక్కల్లో కనీసం 35 మార్కులు సాధించాల్సి ఉంటుంది. దాంతో పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుకుకి లెక్కల పాఠాలు చెప్పడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసింది?జీరో అని ముద్రపడిన కొడుకుని క్లాసులో హీరోగా ఎలా మార్చింది అనేదే ఈ సినిమా కధ.   

మద్య తరగతి కుటుంబాలు ఎదుర్కొనే కష్టాలు, మనసును కదిలించే భావోద్వేగాలు, హాయిగా నవ్వుకోగల హాస్య సన్నివేశాలు అన్నిటినీ సమపాళ్ళలో చక్కగా రంగరించి తెరకెక్కించడంతో ప్రేక్షకులు చిన్న కధ అయినా కనెక్ట్ అయ్యారు. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించేందుకు రాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష