అందరికీ థాంక్స్: జూ.ఎన్టీఆర్‌

September 27, 2024


img

నేడు ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా విడుదలైంది. ప్రేక్షకులకు సినిమా నచ్చడంతో జూ.ఎన్టీఆర్‌, కొరటాల శివ గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయిన్నట్లు చాలా సంతోషంగా ఉన్నారు. జూ.ఎన్టీఆర్‌ స్పందిస్తూ, “నేను ఎదురుచూస్తున్న ఈ రోజు రానే వచ్చింది. దేవరపై మీ స్పందనలు చూసి చాలా సంతోషం కలుగుతోంది. ఇంత గొప్ప భావోద్వేగాలు కలిగించేవిదంగా సినిమా తీసినందుకు థాంక్యూ కొరటాల శివగారు. 

సోదరుడు అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. ఈ సినిమాకి మూల స్తంభాలుగా నిలిచిన  నిర్మాతలు హరికృష్ణ కొసరాజుగారికి, మిక్కిలినేని సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 

ఈ సినిమాని మీ కెమెరాతో అద్భుతం మార్చిన రత్నవేలుగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఈ సినిమా నిర్మాణంలో పాల్గొన్నప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. 

దేవర సినిమా కోసం అభిమానుల సందడి , సంబరాలు చూస్తూనే నా మనసు ఆనందంతో పొంగిపోయింది. మీ అభిమానానికి నేను ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాను. నేను ఎంతగా సంతోషిస్తున్నానో మీరు కూడా అంటే ఎంజాయ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ ఎప్పటికీ అలరిస్తూనే ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను,” అని ట్వీట్‌ చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష