జూ.ఎన్టీఆర్‌ అభిమానుల హడావుడి చూశారా?

September 26, 2024


img

రేపు శుక్రవారం దేవర సినిమా విడుదల కాబోతోంది. అంటే సినిమా విడుదలకి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూ.ఎన్టీఆర్‌ నటించిన తొలి సినిమా ఇది కావడంతో అభిమానుల హడావుడి అంతా ఇంతా కాదు.

రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల ముందు జూ.ఎన్టీఆర్‌ భారీ కటవుట్లు ఏర్పాటు చేసి వాటికి భారీ గజమాలలు వేస్తున్నారు. మరికొందరు కటవుట్లకు పాలతో అభిషేకాలు చేస్తున్నారు. థియేటర్ల ముందు వందలాది మంది అభిమానులు చేరి బాజాభజంత్రీలు, టపాసులు, డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు.

వారి ఉత్సాహం, హడావుడి చూస్తే ఏదో శుభకార్యం జరుగబోతున్నట్లు, జూ.ఎన్టీఆర్‌ స్వయంగా అక్కడికి రాబోతున్నట్లే ఉంది. అసలు ఈ స్థాయిలో అభిమానుల హడావుడి చూసి చాలా కాలమే అయ్యింది. అది జూ.ఎన్టీఆర్‌ సినిమా హడావుడి కావడం విశేషం. 


కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటించగా బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా నటించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్‌, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.  

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్‌. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేశారు.     

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష