పవన్‌, కార్తీ లడ్డూ ఎపిసోడ్ అలా ముగిసింది

September 25, 2024


img

కోలీవుడ్‌ నటులు కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో ‘సత్యం సుందరం’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ 'లడ్డూ కావాలా?' అంటూ కార్తీని సరదాగా ప్రశ్నించగా “వద్దు వద్దు... లడ్డూ ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూ” అని చెప్పారు.

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదాన్ని దృష్టిలో పెట్టుకునే కార్తీ ఆవిదంగా చెప్పాడని అర్దమవుతూనే ఉంది. ఆ కార్యక్రమానికి వచ్చిన అందరూ ఆయన సమాధానం విని ముసిముసినవ్వులు నవ్వారు. 

అయితే ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కార్తీ మీద సీరియస్ అయ్యారు. లడ్డూ అంటూ అవహేళనగా మాట్లాడటం సరికాదని కార్తీని హెచ్చరించారు. దానికి కార్తీ కూడా వెంటనే స్పందిస్తూ క్షమాపణ చెప్పడంతో పవన్‌ కళ్యాణ్‌ శాంతించి మళ్ళీ ట్వీట్‌ చేశారు. 

“డియర్ కార్తీగారు... మీరు వెంటనే స్పందించి, మన సాంప్రదాయాలను గౌరవిస్తునందుకు అభినందిస్తున్నాను. తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు… వాటిలో తయారయ్యే లడ్డూ ప్రసాదాలు కొన్ని కోట్లమంది మనోభావాలతో ముడిపడి ఉంటాయనే సంగతి మరిచిపోకూడదు. కనుక వాటి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 

ఈవిషయమే మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఆవిదంగా చెప్పాను తప్ప మరో ఉద్దేశ్యం లేదు. మీరు కూడా ఉద్దేశ్యపూర్వకంగా ఆవిదంగా అనలేదని గ్రహించాను. మనవంటి సెలబ్రేటీలు మన సంస్కృతి, సాంప్రదాయాలు వంటివి పెంపొందించేలా వ్యవహరించాలి. అందరం కలిసి ఇటువంటివాటిని పెంపొందించుకు మన సినిమాల ద్వారా కూడా ప్రయత్నిద్దాం. 

ఓ గొప్ప నటుడుగా మీరు అంకితభావంతో సినిమాలు చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.  సత్యం సుందరం సినిమా విజయవంతం అవ్వాలని కోరుకొంటున్నాను. మీ సినిమా బృందంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ సినిమా ప్రేక్షకులను రంజింపజేస్తుందని నమ్ముతున్నాను,” అని పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌ సారాంశం. 

అందుకు కార్తీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేయడంతో ఈ వివాదం ముగిసిపోయింది.


Related Post

సినిమా స‌మీక్ష