చిరంజీవి, మహేష్ బాబు ఎంత పెద్ద హీరోలైనా, ఏదైనా సినిమా బాగుంటే వెంటనే సోషల్ మీడియాలో వాటిని, వాటిలో నటించిన నటీనటులను, దర్శకులను, నిర్మాతలని తప్పక మెచ్చుకుంటారు.
రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా, సత్య, ఫారియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు చేసిన మత్తు వదలరా-2 సినిమాపై వారిరువురూ ప్రశంశల వర్షం కురిపించారు.
ఆ సినిమా చిరంజీవి ఏమన్నారంటే, “నిన్ననే 'మత్తు వదలరా-2' చూసాను. ఈ మధ్య కాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. End Titles ని కూడా వదలకుండా చూసాను. ఈ క్రెడిట్ అంతా రితేష్ రాణాకి ఇవ్వాలి. అతని రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మనల్ని వినోద పర్చిన విధానానికి అభినందించకుండా వుండలేము. Hats off @RiteshRana! నటీ నటులకు, @Simhakoduri23 కి, ప్రత్యేకించి #Satya' కి నా అభినందనలు! అలాగే @fariaabdullah2 @kaalabhairava7 లకు మంచి విజయాన్ని అందుకున్న @mythriofficial సంస్థకు, టీం అందరికీ నా అభినందనలు! Don't miss #MathuVadalara2 !! 100% Entertainment Guaranteed,” అని ట్వీట్ చేశారు.
మహేష్ బాబు ఏమన్నారంటే, “మత్తు వదలరా-2 మొదటి నుంచి చివరి వరకు మమ్మల్ని బాగా నవ్వించింది. సినిమాని చాలా ఆనందించాము. సింహా కోడూరితో సహా టీమ్‌లో అందరూ అవలీలగా నటించారు. వెన్నెల కిషోర్ తెరపై కనిపించినప్పుడు నా కూతురు నవ్వాపుకోలేకపోయింది. అలాగే సత్యా... నువ్వు తెరపై కనిపించినప్పుడు మేము నవ్వాపుకోలేకపోయాము. అద్భుతంగా నటించావు. ఈ సినిమాతో మంచి కాలక్షేపం అయ్యింది. టీమ్ అందరికీ అభినందనలు,” అని ట్వీట్ చేశారు.