సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)-2024 వేడుక శనివారం రాత్రి దుబాయ్‌లో అట్టహాసంగా జరిగింది. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అందరూ పాల్గొనేందుకు తరలి రావడంతో ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమం మరింత ఉత్సాహంగా, ఉత్తేజంగా సాగింది. ఈ కార్యక్రమంలో 2023లో విడుదలైన దక్షిణాది రాష్ట్రాల సినిమాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ప్రధానం చేశారు. టాలీవుడ్‌కి సంబందించి....
ఉత్తమ నటుడు: నాని (దసరా)
ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా)
ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా)
ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ సంగీత దర్శకుడు: అబ్దుల్ వాహేబ్ (హాయ్ నాన్న)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: భువనగౌడ (సలార్)
ఉత్తమ నేపధ్య గాయకుడు: రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు-బలగం)
ఉత్తమ హాస్య నటుడు: విష్ణు (మ్యాడ్)
ఉత్తమ సహాయ నటి: బేబీ ఖియారా ఖాన్ (హాయ్ నాన్న)
ఉత్తమ పరిచయ నటుడు: సంగీత్ శోభన్ (మ్యాడ్)
ఉత్తమ పరిచయ నటి: వైష్ణవి చైతన్య (బేబీ)
ఉత్తమ పరిచయ నిర్మాణ సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్ (హాయ్ నాన్న)
ఉత్తమ పరిచయ దర్శకుడు: శౌర్యువ్ (హాయ్ నాన్న)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): సాయి రాజేష్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆనంద్ దేవరకొండ (బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్.