మా నాన్న సూపర్ హీరో... టీజర్‌ చూడాల్సిందే!

September 13, 2024


img

సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయి చంద్ ప్రధాన పాత్రలలో ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా టీజర్‌ చూస్తే తండ్రీ కొడుకుల అనుబందం కధాంశంగా తీసుకొని భావోద్వేగాలతో నిండిన ఓ చక్కటి సినిమా అని అర్దమవుతుంది. ‘లూజర్’ ఫేమ్ దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 11న విడుదల కాబోతోంది. 

ఈ సినిమాలో ఇంకా ఆర్ణ, రాజు సుందరం, శశాంక్, ఆమని, చంద్ర వెంపటి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: జయ్ క్రిష్, కెమెరా: సమీర్ కళ్యాణి, కొరియోగ్రఫీ: దిల్‌రాజు సుందరం, డైలాగ్స్: భరద్వాజ్, శ్రావణ్, అభిలాష్, ఎడిటింగ్: అనిల్ కుమార్‌ చేస్తున్నారు. వీ సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సునిల్ బలుసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష