ఆయ్... రేపటి నుంచే ఓటీటీలోకి వస్తున్నామండి!

September 11, 2024


img

ఓటీటీల పుణ్యమాని అటు నిర్మాతలకు, ఇటు థియేటర్లకు వెళ్ళే స్థోమత, ఓపిక లేని ప్రేక్షకులకు కూడా చాలా మేలు కలుగుతోంది. ఎంత గొప్ప లేదా ఫ్లాప్ సినిమా అయినా నెల తిరిగేసరికి ఓటీటీలోకి వచ్చి పడాల్సిందే.

ఆగస్ట్ 15న రవితేజ-హరీష్ శంకర్‌ కాంబినేషన్‌లో మిస్టర్ బచ్చన్ సినిమా, పూరీ జగన్నాథ్-రామ్ పోతినేని కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ సినీమాలు రిలీజ్ అయ్యాయి కానీ రెండూ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలో ప్రసారం అవుతుండగా, గురువారం నుంచి మిస్టర్ బచ్చన్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్నాడు. 

అయితే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమా ‘ఆయ్’ మాత్రం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఆయ్ సినిమాలో జూ.ఎన్టీఆర్‌ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటించాడు. సినిమాలో కామెడీ బాగా పండటంతో నార్నె నితిన్ ఒడ్డున పడటమే కాగా ఇద్దరు పెద్ద హీరోల సినిమాల నుంచి పోటీని తట్టుకొని ‘ఆయ్’ అని అందరినీ పలకరించడానికి ఆహా ఓటీటీలోకి రేపే వచ్చేస్తున్నాడు.

చిరంజీవి కుమార్తె నీహారిక నిర్మాతగా వచ్చిన కమిటీ కుర్రాళ్ళు సినిమా కూడా గురువారం నుంచే ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది.             



Related Post

సినిమా స‌మీక్ష